విఐపి స్కూల్‌లో ఘనంగా స్వయంపాలన దినోత్సవం
**ముఖ్య అతిథిగా హాజరైన కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి**
**తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే విజయానికి దిక్సూచి!**
*మన సాక్షి గొంతుక /తెలంగాణ బ్యూరో (రాజమోని. రవీందర్ గౌడ్)*
కేశంపేట్ మండలం ఇప్పలపల్లి గ్రామంలోని వి .ఐ .పి స్కూల్‌లో శుక్రవారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి హాజరైనారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సూచించిన మార్గంలో నడుస్తూ జీవితంలో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట కృష్ణ, ఉపాధ్యాయులు,విద్యార్థులు స్వయంపాలన దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో స్వయం శిక్షణ, క్రమశిక్షణ,సమర్థతను పెంపొందించే లక్ష్యంతో వివిధ కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట కృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులు తమ జీవితంలో స్వయం శిక్షణ మరియు క్రమశిక్షణను అనుసరించడం ద్వారా మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు,తల్లిదండ్రుల సహకారం అత్యంత ముఖ్యమని వారు భావించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపి, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా నిర్వహించబడతాయని ఆశించారు.