రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి —-
మస్జిద్ సరాయే మీరాలం కమిటీ
నల్లగొండ జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఆడిటర్——–_ ఎండి.మహిమూద్ నిర్వహణ బాధ్యతలు
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్:
(మిర్యాలగూడ) ఫిబ్రవరి:15
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మస్జిద్ సరాయే మీరాలం కమిటీ గడువు ముగిసిన తర్వాత రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డి) టాస్క్ ఫోర్స్ మహమ్మద్ ఆరీఫ్ అలీ ఖాన్ పర్యవేక్షణలో నల్లగొండ జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఆడిటర్ ఎండి.మహిమూద్ నిర్వహణ బాధ్యతలు శనివారం చేపట్టారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదేశాలతో అధికారులు మిర్యాలగూడకు చేరుకుని ఆగస్టు 2024లో కమిటీ పదవీ కాలం ముగిసిన అధ్యక్షుడు ఎండి. మహమూద్ ఆలీకి ఫోన్ చేసి పిలిచిన రాక పోవడంతో పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి బాధ్యతలు చేపట్టారు.మస్జిద్ గదులలో,దుకాణాలలో ఉన్న వారు అద్దె వక్ఫ్ ఇన్స్పెక్టర్ కు ఇవ్వాలని కోరారు.గత 32 సంవత్సరాలుగా ఒక్కరే అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో ప్రార్థనాలకు వచ్చే వారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్, కలెక్టర్, సబ్ కలెక్టర్, బోర్డు చైర్మన్, సిఇఒకు ఫిర్యాదు చేయగా అధికారులు కదిలి వచ్చారు. కమిటీకి ఎన్నికల కోసం ప్రకటన జారీ చేస్తామని, పోటీ చేయాలనుకునే వారు ఏకగ్రీవంగా ఒక ప్యానెల్ సమర్పిస్తే వెంటనే ఆమోదం తెలిపే అవకాశం ఉందని రెండు, మూడు ప్యానెల్స్ వస్తే ఎన్నిక నిర్వహిస్తామని ఓఎస్డి పేర్కొన్నారు. మస్జిద్ కు వచ్చే వారి ఓటర్ జాబితా సిద్ధం చేసి ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. వక్ఫ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయ్యద్ ఇబ్రహీం, లీగల్ అడ్వైజర్ ఎండి.ఇమ్రాన్, సర్వేయర్ ఎండి.వాజిద్, ముసలియన్లున్నారు.