అభిరామ్ యాదవ్ జన్మదినం సందర్భంగా మాతృమూర్తులకి పండ్లపంపిణి——-
అమీర్అలీ ఫౌండేషన్
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: నాగార్జున సాగర్ నియోజక వర్గం: ఫిబ్రవరి:13
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం మధారిగూడేం గ్రామానికి చెందిన ఆవుల పురుషోత్తం సుమతి యొక్క కుమారుడు అభిరామ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా
ఆవంతీపురం వృద్దాశ్రమంలో మాతృమూర్తులకి పండ్లపంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గోన్నా అమీర్అలీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్అలీ మాట్లాడుతూ
సమాజంలో మనవంతుగా మంచి చేయ్యాలనే సంకల్పం తో చిరుప్రాయం నుండే పిల్లలకూ దయాగుణం దానగుణం ఉండేలా తల్లి తండ్రి ప్రోత్సహిస్తూ తమ ఇంట్లో జరిగే వివాహ వార్షికోత్సవ వేడుకలు పుట్టిన రోజు వేడుకలు వృద్దాశ్రమంలో మాతృమూర్తుల తో జరుపుకోవడం అభినందనీయం అన్నారు
ఆవంతీపురం వృద్దాశ్రమం నిర్వాహకులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ చిరంజీవి అభిరామ్ యాదవ్ జన్మదినం సందర్భంగా మా ఆశ్రమం లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు వారికి మా అందరి దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి
జీవితం లో మంచి విద్యా సంస్కారం తో దయాగుణం కలిగి అమ్మ నాన్న లకి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందిస్తూన్నాం అన్నారు