మిర్యాలగూడ రవీంద్ర భారతి హై స్కూల్ లో సెల్ఫ్ గవర్నమెంట్ డే
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: మిర్యాలగూడ: మార్చి:07
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రవీంద్ర భారతి హై స్కూల్ లో సెల్ఫ్ గవర్నమెంట్ డేఘనంగా నిర్వహించడం జరిగింది.విద్యార్థులు ఉపాధ్యాయులు చాలా చక్కగా తమ యొక్క పాత్రలు నిర్వహించారు అదేవిధంగా కొంతమంది విద్యార్థులు పి ఈ టి గాను కొంతమంది విద్యార్థులు గన్మెన్ గా చక్కగా వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కందుల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చాలా చక్కగా తమ యొక్క పాత్రలను నిర్వర్తించాలని కొనియాడారు ఎంఈఓ గా బాణాల సంజన ఎమ్మెల్యేగా కార్తీక్ జిపిడిఓ గా సంతోష్ డీఈవోగా ముని కలెక్టర్గా పవన్ కళ్యాణ్ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ప్రవళిక చీఫ్ మినిస్టర్ గా శంకర్ చాలా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కందుల రమాదేవి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు