మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు….
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి….* రఘునాథపల్లి…. యువకులు విద్యార్థులు మత్తు పదార్థాలు. మాదక ద్రవ్యాలతో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని.. దురాఅలవాట్లకు దూరంగా ఉండి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు… బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం కోసం ధూమ పారం.మద్యపానం. మాదక ద్రవ్యాలు వాడడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ మత్తుకు దూరంగా ఉండాలని అన్నారు. మత్తు పదార్థాలు విక్రయించిన వాడిన వెంటనే తమ సమాచారం అందించాలన్నారు సమాజాన్ని రక్షించడంలో యువత ప్రతి ఒక్కరూ భాగస్వాములే ముందుండాలని సూచించారు… ఎవరైనా గంజాయి మరకద్రవ్యాలు అమ్ముతున్నారని సమాచారం తెలిస్తే వెంటనే 112 నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు