సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్, ఫిబ్రవరి 15 :
మెదక్ జిల్లా.శివంపేట్ మండలంలోని కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల కరుణాకర్ రెడ్డి, నర్సాపూర్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి మరియు శివంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పులిమామిడి నవీన్ గుప్తా నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో పాల్గొని వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, బంజారాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.