భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలి
భగత్ సింగ్,రాజగురు,సుఖదేవ్ లు నేటి విద్యార్థి, యువతరానికి ఆదర్శం కావాలి
మోడీ కుహనా దేశభక్తిని ఎండగడదాం
ట్రంప్ దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడుదాం
ప్రజా గొంతుక మార్చి 18 అశ్వరావుపేట నియోజకవర్గ ప్రతినిధి
ధమ్మపేట:దేశ స్వాతంత్రం కోసం,బ్రిటిష్ ముష్కరులు అమలు చేసిన అనిచివేత,దోపిడి, దౌర్జన్యాలకు,సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిరంతర పోరాట స్ఫూర్తితో సాగిన భగత్ సింగ్ రాజగురు,సుఖదేవులు నేటి విద్యార్థి,యువతరానికి ఆదర్శం కావాలని పివైయల్ జిల్లా కార్యదర్శి కోర్సా రామకృష్ణ.మంగళవారం ధమ్మపెట సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆఫీసులో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన మండల సెమినార్ లో అన్నారు.ఈ సెమినార్ పివైయల్ డివిజన్ అధ్యక్షులు కాక వెంకటేశ్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కోర్సా రామకృష్ణ మాట్లాడుతూ..మానవ చరిత్ర పుటలు తిరగేస్తే చార్వాకులు,స్పార్టకస్ వంటి ఉజ్వల తారలు ఉన్నతమైన ప్రగతిశీల ప్రయోజనాల కోసం ప్రాణాలర్పించారని, ప్రపంచ స్థాయిలో చేగువేరా,ఫైడల్ కాస్ట్రో లాంటి విప్లవ వీరులు అమెరికన్ సామ్రాజ్యవాదుల కబంధహస్తాల్లో అమరులయ్యారని అదే కోవలో భారత ఉపఖండం లో భగత్ సింగ్,రాజగురు, సుఖదేవ్ లు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో ఉరి తీయబడినరని భగత్ సింగ్ తన సహచరులు కలలుగన్న సార్వభౌమాధికారం, లౌకికవాదం,సోషలిజం కోసం పోరాడుతున్న ఎందరికో గొప్ప స్ఫూర్తినిస్తుందని వారు అన్నారు.భారతదేశన్ని పట్టిపీడిస్తున్న సామ్రాజవాదానికి, పెట్టుబడిదారు వ్యవస్థకు, మతోన్మాదం,కులతత్వాలకు వ్యతిరేకంగా భారతీయ విద్యార్థి,యువతరం,ప్రజలు భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని దేశంలో మోడీ ప్రభుత్వం కుహానా దేశభక్తిని బట్టబయలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న భారత ప్రజలపై అనుసరించే దుశ్చర్యలకు వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజగురు,సుఖదేవ్ ల 94వ వర్ధంతి సభలను జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ సెమినార్ అనంతరం భగత్ సింగ్ రాజగురు,సుఖదేవుల 94 వ వర్ధంతి సందర్భంగా ముద్రించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు.ఈ సెమినార్ లో పి వై ఎల్ జిల్లా జిల్లా నాయకులు కుంజ అర్జున్,డివిజన్ నాయకులు సున్న జగన్,యుకె మహేష్ మండల నాయకులు కాక చందు,పొట్ట సంతోష్,కురసం తిరుపతిరావు,కురం రవి కురాశం రాజు,రాజేష్,స్వయం నాగేశ్వరావు తెల్లం నగేష్ తెల్లం చిన్నిరావు తదితరులు పాల్గొన్నారు.