ఈదుల్ ఫితర్ (రంజాన్)నమాజ్ వేడుకల కోసం మూడు రోజుల నుండి ఈద్గాలో పారిశుద్ధ్య కార్యక్రమం
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: హాలియా:మార్చి:27
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ లోని ఈద్గా ఖబ్రస్థాన్ నందు రేపు సోమవారం రోజున జరగబోయే ఈదుల్ ఫితర్ (రంజాన్)నమాజ్ వేడుకల కొరకు గత మూడు రోజుల నుండి ఈద్గాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నవి, అదే విధంగా ఈ రోజు జేసిబి సహాయంతో కంప చెట్లు, పనికిరాని చెట్లు తొలగించడం తో పాటుగా ల్యాండ్ లెవెలింగ్ పని చేయించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ బాబుద్దిన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మాజహర్ మొహియొద్దీన్ పాల్గొనడం జరిగినది…