నందికొండ మున్సిపాలిటీ ముస్లిం మైనార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: నాగార్జున సాగర్ నియోజక వర్గం: మార్చి:01
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఈఈ/25 మైనార్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నిర్వహించటం జరిగింది, నందికొండ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్ గా సయ్యద్ షబ్బీర్, వైస్ ప్రెసిడెంట్ గా షేక్ గౌస్, సెక్రటరీగా షేక్ అస్గర్ లు ఎన్నికయ్యారు, జాయింట్ సెక్రటరీలు గా సుభాని, కాసిం( చంటి), అబ్దుల్ గని , ట్రెజరర్ గా రహమత్ అలీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ముజ్జు బాయ్, కాసిం( వాటర్ ప్లాంట్), నజీర్ (బిల్డర్), ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్లుగా నజీర్, షరీఫ్, అన్వర్ కమిటీ అడ్వైజర్లుగా ఇక్బాల్, హమీద్ ఎన్నికయ్యారు, ఈ కార్యక్రమంలో నందికొండ ముస్లిం మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు.