సెకండ్ ర్యాంకు సాధించిన బచ్చన్నపేట ఆణిముత్యం
పట్టుదలతో చదివి ఇంటర్‌లో మెరిసిన విద్యార్ధిని
440కి 437 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన పులిగిల్ల శ్రీజ
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
పట్టుదల, కృషి, మరియు లక్ష్యసాధనకి నిదర్శనంగా నిలిచిన విద్యార్థిని పులిగిల్ల శ్రీజ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ 440కి 437 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించి, తన స్వగ్రామమైన బచ్చన్నపేట కు గర్వకారణంగా నిలిచింది. బైపిసి గ్రూపులో ఈ అద్భుత విజయాన్ని సాధించిన పులిగిల్ల కనకయ్య లలిత కుమార్తె పులిగిల్ల శ్రీజ.గ్రామస్తులు, బంధువులు, ఉపాధ్యాయులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, పులిగిల్ల శ్రీజ మరింత ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఎదగాలి” అని ఆకాంక్షిస్తున్నారు.విద్యారంగంలో ఇలా మెరుగైన ప్రతిభ చూపించి, గ్రామానికి పేరు తెచ్చిన పులిగిల్ల శ్రీజ భవిష్యత్తులో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.