బిజెపి పార్టీకి వీరికి ఎలాంటి సంబంధం లేదు
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో కట్కూర్ గ్రామానికి చెందిన కాదునూరి పాండు ,ఐలయ్య చేరినట్లుగా వచ్చిన వార్తను ఖండిస్తున్నామని జనగామ జిల్లా ఓబీసీ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల ఎర్ర రామన్న అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కట్కూర్ గ్రామానికి చెందిన పాండు, ఐలయ్య బిజెపి పార్టీకి చెందినవారు కాదని వారు గతంలో ఎమ్మెల్యే ఎన్నికలలోనే వేరే పార్టీలో చేరి అందులో మనుగడ లేక ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో చేరి స్థానిక ఎన్నికలు వస్తున్న సందర్భంగా బిజెపి పార్టీ పైన బురదజల్లే రాజకీయం చేస్తున్నారని, వారి ఆటలు ఇక సాగమని హెచ్చరించారు. అసలైన బిజెపి కార్యకర్త పార్టీ మారారని దేశం కోసం సేవ చేయడానికి ముందుంటారని రానున్న ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని కమలం పువ్వు జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.