Saturday, March 15, 2025

విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కార్పొరేట్ విద్య వ్యవస్థను రద్దు చేయాలి.

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పి.డి.యస్.యు రాష్ట్ర కమిటీ పిలుపులో బాగంగా విద్యార్థుల పట్ల మృత్యు వలయాలుగా మారిన కార్పొరేట్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కార్పొరేట్ యాజమాన్యల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పి.డి.యస్.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి దుర్గం ప్రణయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు పెద్ద పీటలు వేస్తున్నాం అని చెబుతూనే దేశంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా వ్యవస్థను పెంచి పోషిస్తున్నారనీ. కార్పొరేట్ వ్యవస్థకు పాలకులు అండదండలుగా ఉంటూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.పర్మిషన్ లేకపోయినా పుట్టకొక్కుల రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాలయాలు పుట్టుకొస్తున్నాయని, అనేక మాయమాటలు చెప్పి కార్పొరేట్ ఊబిలోకి విద్యార్థులను లాగి ఫీజుల వేధింపుతో రోజుకో విద్యార్థిని బలి తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే ఖమ్మం కేంద్రంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య (కార్పొరేట్ హత్య) జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కార్పొరేట్ వ్యవస్థను రద్దు చేయాలని లేని ఎడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సంధర్బంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో పి.డి.యస్.యు జిల్లా నాయకులు కిరణ్,నాయకులు వెంకటేష్,గణేష్,కుమార్,చరణ్ తదితరులు పాల్గోన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp