గాంధీ జయంతి రోజున హాలియా మున్సిపాలిటీలో మాంసం విక్రయాల నిషేధం….
కమిషనర్ ఎం రామదుర్గ రెడ్డి…పురపాలక సంఘం, హాలియా
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: సెప్టెంబర్:28
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని చికెన్, మటన్, ఫిష్ వ్యాపారస్తులకు తెలియజేయునది ఏమనగా, తేదీ 02.10.2025 (గురువారం) నాడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి మాంసం విక్రయం చేయరాదు.
ఈ సందర్భంగా వ్యాపారులు మున్సిపాలిటీ ఆదేశాలను కచ్చితంగా పాటించవలసినదిగా కోరడమైనది.
అంతేకాకుండా, ఈ నిర్ణయం విషయమై ముందస్తుగా అన్ని మాంసం విక్రయదారులకు నోటీసులు జారీ చేయబడినవి.
అందువలన వ్యాపారస్తులు మున్సిపాలిటీ సూచనలను గౌరవించి, మహాత్మా గాంధీ జయంతి రోజున ఎలాంటి మటన్ , చికెన్ , ఫిష్ , బీఫ్ మరియు ఎలాంటి మాంసం విక్రయం జరగకుండా సహకరించవలసిందిగా కోరుతున్నాము.