సేవాలాల్ జయంతీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సేవాలాల్ జయంతివేడుకలు
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్ :హైదరాబాద్: ఫిబ్రవరి :20
బంజారాల ఆరాధ్య దైవం సద్గూరు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 జయంతి వేడుకల్లో భాగంగా రవీంద్రభారతి ఘంటసాల ప్రాంగణంలో “మహా భోగ్ బండార్” పూజ 300 మంది బంజార సంత్ సాధువులచే బంజార హిందూ పద్ధతిలో, మాత జగదాంబ ,సంత్ సేవాలాల్ , హతిరం బావాజీ, తపస్వి రాం రావు మహారాజ్ లకు హొమం నిర్వహించి నైవేద్యం సమర్పించడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి
శ్రీమతి డీకే అరుణ గ
శ్రీ ఈటెల రాజేందర్
శ్రీ పి మురళీధర్ రావు
శ్రీ రాంచందర్ రావు
భాగ్యనగర్ సేవాలాల్ ఉత్సవ సమితి చైర్మన్ డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఉత్సవాలు సమితి కన్వీనర్ ప్రేమ్ నాయక్, కో రవి నాయక్, బానోత్ జ్యోతి నాయక్ , రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.