Tuesday, July 8, 2025

అర్ధరాత్రి వేళ పెద్దపల్లి పట్టణం పరిసరాల్లో పోలీస్ కమీషనర్ ఆకస్మిక తనిఖీ.

ప్రజా గొంతుక రిపోర్టర్ నూక రామదాసు /రామగుండం

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం అర్థరాత్రి పెద్దపల్లి లోని సాగర్ రోడ్డు ప్రాంతం లో పెద్దపల్లి పోలీస్ వారు నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ చెరువు కట్ట ప్రాంతం, మున్సిపాల్ కాంప్లెక్స్ ఏరియా ప్రాంతాలు పట్టణంలో ని ఏటీమ్ సెంటర్ లను ఆకస్మికంగా సందర్శించారు. అర్ధరాత్రి సమయంలో బయట తిరుగు తున్న వారిని ఆపి వారితో మాట్లాడారు. ప్రధానంగా శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక పోలీసులు చేపడుతున్న పోలీస్ పెట్రోలింగ్ తోపాటు, రాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరిగే వారి గురించి, గంజాయి, మద్యం సేవించే తిరిగే ఆకతాయిల గురించి, ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద నుండి డ్రోన్ ద్వారా ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో ఎవరైనా ఉన్నారా అని పరిశీలించారు .ఎటిఎం సెంటర్ లను సందర్శించి అలారం సిస్టమ్, సిసి కెమెరాల పని తీరు, ఇతర భద్రత విషయాలపై సెక్యూరిటీ గార్డ్ తో మాట్లాడి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. అదేవిదంగా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని బ్యాంకులలో అలారం సిస్టం, సీసీ కెమెరాలు పనితీరు, సెక్యూరిటీ గార్డ్స్, ఇతర భద్రత పరమైన ఏర్పాట్లు అని సరిగా ఉన్నాయా లేదా అనేది స్వయంగా వెళ్లి తనిఖీ చేసి సంబందించిన అధికారులతో మాట్లాడి భద్రత చర్యలు సరిగా లేని బ్యాంకు లలో ఏర్పాటు చేసే విధంగా చూడాలని అధికారుల ను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మద్యం షాపులు, ఇతర వ్యాపార సంస్థలు పాటిస్తున్న సమయపాలనపై పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp