మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి సావిత్రిబాయి పూలే వర్ధంతి….
ఐద్వా పట్టణ కార్యదర్శి —–భూతం అరుణకుమారి
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి:నల్లగొండ జిల్లా:మార్చి:10
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి మాట్లాడుతు అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండ పట్టణంలోని సావిత్రిబాయి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. మహిళలు కాలినడక నుండి ఇప్పుడు విమానం నడిపే వరకు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మహిళలు ప్రస్తుతం ఎక్కడ రాజీ పడకుండా మన లక్ష్యం వైపు సాగుతూనే ఉండాలని బతుకు బాటను వేసుకొని రంగవల్లి నైపుణ్యమే కాకుండా రాజకీయ చైతన్యం పెంచుకోవాలని నేటి ఆధునిక సమాజానికి అంది వచ్చిన అద్భుత సాంకేతిక సాధనం సోషల్ మీడియా యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సప్ ఇలా ఒకటి రెండు కాదు లెక్కకు మించిన ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఇంటి విషయాల నుండి ప్రపంచ రాజకీయాల వరకు అన్ని క్షణాల్లోనే మనకు అందుబాటులో ఉంటున్నాయి అయితే సోషల్ మీడియాలోని మంచినే ఎంచుకుంటే అదో అవకాశం హింస ద్వారా కానీ చెడును ఎంచుకుంటే మాత్రం అది విషవలయం ఇప్పుడు ఆ మంచి చెడుల విచక్షణ లోపించడమే ఆందోళనకరంగా మారింది. ఇతరుల జీవితాలపై విచక్షణాలేని విశ్లేషణలు అర్థంపర్థం లేని వ్యాఖ్యానాలు చేసే ప్రబుద్ధులు కొందరైతే ఎవరికి వారు తమ ఆనందాన్ని పంచుకున్న దీనికి విపరీత అర్ధాలు తీసి అసభ్యకరమైన కామెంట్లు చేసే నీచులు మరికొందరు ఇది ప్రస్తుతం ఓ ధోరణిగా ప్రబలిపోవడం మనుషుల్లో ఒక విపరీతంగా మారిన సోషల్ మీడియా వేదికగా ఉంది.డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్ ష్వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కన్వీనర్ దెండం పెళ్లి సరోజ, ఉమా మహేశ్వరి,మమత తదితరులు పాల్గొన్నారు.