బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రాష్ట్ర సరిహద్దులు అప్రమత్తం
నాగార్జునసాగర్ సరిహద్దుల్లో పశుసంవర్ధక శాఖ తనిఖీలు
బర్డ్ ఫ్లూ బార్డర్ సరిహద్దుల్లో రెండవ రోజు ప్రత్యేక తనిఖీలు-
భారీగా పడిపోయిన చికెన్ విక్రయాలు
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) నాగార్జున సాగర్ నియోజక వర్గం: ఫిబ్రవరి:13
ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో సరిహద్దు లో.ప్రభుత్వ ఆదేశాలతో ఏపీని ఆనుకొని ఉన్న నాగార్జునసాగర్ సరిహద్దు లో అధికారులు అప్రమత్తమయ్యారు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ పశు సంవర్థక శాఖ పోలీస్ శాఖ ఫారెస్ట్ శాఖ సిబ్బందిని నియమించారు. వాహనాలను తనిఖీ చేసిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ప్రత్యేకించి కోళ్లు, కోడి గుడ్లు, కోళ్ల దాణా ఏపీ నుంచి మన రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కోళ్లు,గుడ్లు, దాణాతో ఏవైనా వాహనాలు వస్తే వాటిని తిప్పి పంపిస్తున్నారు.తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు నాగార్జునసాగర్ లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిఘా పెంచారు. తెలంగాణలోకి వస్తున్న కోళ్ల వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు.
అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాల సరిహద్దులను కట్టుదిట్టం చేసింది. ఆంధ్రా నుంచి కోళ్లు తెలంగాణలోకి అనుమతించొద్దని ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. అందులోభాగంగా నాగార్జునసాగర్ తనిఖీ కేంద్రం వద్ద పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఆంధ్రా,నుంచి తెలంగాణలోకి రవాణా చేస్తున్న కోళ్ల వాహనాలను అడ్డుకుని తిరిగి వెనక్కు పంపిస్తున్నారు. వైరస్ పూర్తిగా నశించిన అనంతరం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చేవరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని, అప్పటి వరకూ బ్రాయిలర్, లేయర్ కోళ్ల వాహనాలు సహా చిక్స్ వాహనాలు కూడా రాష్ట్రంలోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బిసన్న. పశు సంవర్ధక శాఖ నుండి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కేశవ ఆజ్మీర, అటవీశాఖ అధికారులు రమేష్, రవీందర్, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు