Tuesday, July 8, 2025

యోగా సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం

యోగా సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం

జిల్లాపరిషత్‌ హై స్కూల్‌ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

శంషాబాద్. జూన్ 21(మన సాక్షి గొంతుక :ఆర్.ఆర్.గౌడ్ )అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం శమ్షాబాద్‌లోని జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ మైదానంలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ ఆర్. గణేష్‌ గుప్త, నర్సింగ్ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ డి. వెంకటేష్‌ గౌడ్‌, పిఏసిఎస్‌ మాజీ చైర్మన్‌ కె. మహేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్. గణేష్ గుప్త మాట్లాడుతూ, “రోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయిస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు” అని పేర్కొన్నారు.డి. వెంకటేష్‌ గౌడ్ మాట్లాడుతూ, “యోగా ద్వారా ఒత్తిడి నివారణతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. యూత్ ఈ దిశగా దృష్టి పెట్టాలి” అని సూచించారు.కె. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్న ఈ తరుణంలో యోగా ఒక్కటే సమగ్ర పరిష్కారం,అని,అభిప్రాయపడ్డారు.ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంచే ఉద్దేశంతో గ్రామ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. స్థానిక మహిళలు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని పలు యోగాసనాలు చేశారు. యోగా ట్రైనర్ మార్గనిర్దేశంలో ప్రాణాయామం, ధ్యానం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp