తల్లిదండ్రులు లేని ఆడబిడ్డ వివాహం..
చలించిన సామాజిక వేత్త “ జంగిటి “ విద్యనాథ్ హృదయం….
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో అమ్మ నాన్న లేని నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి పెద్దదిక్కు గా అన్నగా సామాజికవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంగిటి విద్యనాథ్ అండగా నిలిచారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో అల్వాల మధు కరుణ కొన్ని సంవత్సరాల క్రితం మృతిచెందగా తల్లిదండ్రులు లేని ఆడబిడ్డ వివాహానికి సహాయం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు సామాజికవేత్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంగిటి విద్యనాథ్ ను కోరగా వెంటనే చలించి, తన వంతు సహాయంగా పదివేల రూపాయలు ఆడబిడ్డ వివాహానికి కానుకగా అందించారు. అడిగిన వెంటనే ఆర్థిక సహాయం అందించిన జంగిటి విద్యనాథ్ కు పలువురు నాయకులు, ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, పట్టణ అధ్యక్షుడు కోడూరి మహాత్మ చారి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పైసారాజశేఖర్, అల్వాల నర్సింగరావు, దాచేపల్లి రాజయ్య, గుర్రపు బాలరాజు, కూరాకుల రవి, కురాకుల సుభాష్, దేవరకొండ రమేష్, తదితరులు పాల్గొన్నారు.