డీజే సౌండ్స్ వినబడితే జైలుకే — ఎస్ఐ కే.వీరశేఖర్
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకిర్: నాగార్జున సాగర్ నియోజక వర్గం: మార్చి:07
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం:ఇంటర్,టెన్త్ ఇతర పోటి పరీక్షలు ఉన్నందున వివాహ మరియు ఇతర వేడుకల్లో డీజే సౌండ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు,వృద్ధులకు,చిన్న పిల్లలకు,సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే డీజే ఆపరేటర్లపై, యజమానులపై,వేడుకల కోసం మాట్లాడుకునే వారిపై కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని,కేసులు నమోదు చేయడంతో పాటు సీజ్ చేసి జైలుకి పంపిస్తామని నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) ఎస్ఐ కె.వీరశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.