కొండారెడ్డిపల్లిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ప్రజా గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో
కొండారెడ్డిపల్లి గ్రామంలోని గుట్టపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ కానం ప్రేమ్ కుమార్ గౌడ్ భక్తులకు ఆహ్వానం పలికారు.”స్వామివారి కృప అందరికీ ఉండాలని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను” అని ఆయన తెలిపారు.ఈ మహోత్సవాల్లో .భక్తులు బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామివారి ఆశీస్సులను పొందాలని ఆలయ కమిటీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తోంది.