గాంధీభవన్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్ :నాగార్జున సాగర్ నియోజక వర్గం: ఫిబ్రవరి:14
గాంధీభవన్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిప్రమాణ స్వీకార మహోత్సవముకి నాగార్జునసాగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్ రెడ్డి భానుచందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుండి గాంధీభవన్ లో మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు నకిరేకంటి సైదులు మాదిగ, కమతం జగదీశ్వర్ రెడ్డి ,గుర్రం అమరేందర్ రెడ్డి , హరినాయక్, ఐతగోని మధు, అలుగుబెల్లి సందీప్ రెడ్డి ,గుండెబోయిన వేణు గౌడ్,బొమ్ము సాయి, రేపాకుల సాయికుమార్, షరీఫుద్దీన్, గణేష్ నాయక్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.