ప్రభుత్వ ఇఫ్తార్ విందును మా మండలంలో నే ఏర్పాటు చేయండి …..
ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేసిన ముస్లింలు….
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విధంగానే ప్రభుత్వ ఇఫ్తార్ విందును బచ్చన్నపేట మండల కేంద్రంలో నే ఏర్పాటు చేయాలని ముస్లిం మత పెద్దలు బచ్చన్నపేట మండల తాహసిల్దార్ ప్రకాష్ రావు కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలోకాంగ్రెస్ ,టిఆర్ఎస్, ప్రభుత్వాలు అధికారం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు ప్రభుత్వాలు రంజాన్ పండుగ ఇఫ్తార్ విందును ఏ మండలంలో ఉన్న గ్రామాల ముస్లిం సోదరులు అందరిని ఒకటే చోట కార్యక్రమం ఏర్పాటు చేసి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పుడు జనగామ ప్రాంతంతో కలిపి బచ్చన్నపేట మండలం ముస్లింలకు కార్యక్రమం ఏర్పాటు చేయడం తగదు అన్నారు. మా మండలానికి ఇవ్వవలసిన ప్రభుత్వ ఫండింగ్ ను ఇవ్వగలరని కోరారు. మండలంలో నాగిరెడ్డిపల్లి, కొన్నే, బచ్చన్నపేట పలు గ్రామాల ముస్లింలందరం జనగామ ప్రాంతానికి సుమారు 20-25 కిలోమీటర్లు వెళ్లి రాత్రి సమయంలో రావాలంటే అందరూ ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోతారని ఈ విషయాన్ని గ్రహించి బచ్చన్నపేట మండల కేంద్రంలోని కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరారు. షంషీర్ అలీ, మున్నా ,అజీమ్ ,గౌస్ దస్తగిరి, అజాం తదితరులు పాల్గొన్నారు.