గుర్రంపోడులో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..
ప్రజా గొంతుక న్యూస్గుర్రంపోడు..
అనితర సాధ్యుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గొప్ప నాయకుడు తెలంగాణ జాతిపిత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి అన్నారు. సోమవారం కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కేక్ కట్ చేసి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అందజేసి దేశానికి దిక్సూచిగా తెలంగాణను తీర్చిదిద్దారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా చేయూతనిచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 14ఏళ్ళు పోరాటం చేసి సావు అంచులకు వెళ్లి సాధించు కున్న తెలంగాణను గత పదేళ్ల కాలంలో బంగారు తెలంగాణగా
తీర్చిదిద్దాడనీ అన్నారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కుడి భుజంగా ఉన్న మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే సూర్యా పేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి మనందరికీ అండగా ఉన్నారని ఆయన మార్గదర్శనంలో మనమంతా ముందుకు సాగుదాం అన్నారు. ప్రజల దీవెనలే కెసిఆర్ కు శ్రీరామరక్ష అని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయు రారోగ్యా లతో పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పోలే రాములమ్మ రామచంద్రం, మారం గోపాల్ రెడ్డి, వాడపల్లి రంగమ్మ చంద్రమౌళి, కన్నెబోయిన అంజయ్య,మాజీ ఎంపీటీసీ నల్ల మంగమ్మ శ్రీరాములు,నాయకులు వెల్దండ వెంకట్ రెడ్డి, ఐతగొని కృష్ణ గౌడ్, కూనూరు సైదిరెడ్డి, వేముల యాదయ్య, మేకల నాగిరెడ్డి, పాశం వేణుగోపాల్ రెడ్డి, షేక్ ఇస్మాయిల్, మోపురి మురళి చారి, మేకల రఘుపతి రెడ్డి, రామగిరి అనిల్ రావు, జయపాల్ రెడ్డి, షేక్ అమీర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.