పాత ముగ్దూంపురం గ్రామాన్ని గురిజాల ఎంపీటీసీ లో కలపడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి
సిపిఎం ఆధ్వర్యంలో ఎంపీడీవో కు వినతి పత్రం
ప్రజా గొంతుక న్యూస్ నర్సంపేట
పాత ముగ్దూంపురం గ్రామాన్ని గురిజాల ఎంపీటీసీ లో కలపడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఐ ఎం జిల్లా కమిటీ సభ్యులు పరికి మధుకర్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి ఆనుకుని ఉన్న పాత ముగ్దూంపురం గ్రామాన్ని ప్రత్యేక ఎంపీటీసీ గా ఏర్పాటు చేయాలి లేదా చెన్నారావుపేట ఎంపిటిసి లో కలపాలి, సిపిఎం ఆధ్వర్యంలో నర్సంపేట ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ కి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు.
*అనంతరం నిర్వహించిన సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు పరికి మధుకర్ మాట్లాడుతూ పాత ముగ్దూంపురం గ్రామాన్ని నర్సంపేట మున్సిపాలిటీలో, ఎంపిటిసి గురజాల గ్రామంలో కలపడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు, ఈ విలీన ప్రక్రియపై ప్రభుత్వ మరో మారు ఆలోచన చేసి ప్రజల సౌకర్యంగా ఉండే విధంగా చెన్నారావుపేట మండలం కలిపి, ప్రత్యేక ఎంపీటీసీ గ్రామంగా తీర్చిదిద్దాలని వారు డిమాండ్ చేశారు, మున్సిపాలిలో కలపడం వల్ల అభివృద్ధి అనేది ఏమీ ఉండదని, వ్యవసాయ రంగం కొట్టు పడుతుంది, అదేవిధంగా రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోతుందని వారు అన్నారు, వ్యవసాయ కార్మికులు జీవన ఉపాధి కోల్పోతారని వారు ఆవేదన చెందారు, తక్షణమే ప్రభుత్వం ఈ ప్రక్రియను విరమించుకోవాలని వారు మరో మారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు ఏనుగుతల నరేష్,జన్ను రమేష్,డివైఎఫ్ ఐ డివిజన్ నాయకులు గడ్డమీది బాలకృష్ణ ,వెంకన్న , నర్సింగరావు ,కార్తీక్,ప్రభాకర్ , రాజు, తదితరులు పాల్గొన్నారు.