ఫ్లెక్సీ వర్క్ చేసుకుంటూ జీవనం…
ఆపద మీద ఆపద..దాతలు ఆదుకోగలరు…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
అందరికీ అయిన వాడే.. అయినా ఆపదలో ఆదుకునే వారే లేరే..!
మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాడుకున్నోళ్ళే, వ్యక్తితో ఆడుకున్నోళ్ళే ఇప్పుడు కష్టాల్లో ఉన్న కర్రె నరేష్ మీద కనికరం చూపించాల్సింది పోయి కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదంటే ఇంతకు మించిన దౌర్బాగ్యం బహుశా మరొకటి ఉండదేమో…!?
ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అంటారు.
తాకిన వేలుకే మళ్ళీ మళ్ళీ దెబ్బ తగిలినట్లు గా ఉంది బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన మన కర్రె నరేష్ (చిట్టి) పరిస్థితి. మండలంలో పలు పార్టీల ఫ్లెక్సీలు డిజైనింగ్ చేస్తూ జీవనం గడిపేవాడు. కానీ ఆపద మీద ఆపద రావడంతో కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు.గత మూడు నెలల కిందఅనగాసరియగుతేది:03/06/2025 రోజున హార్ట్ స్ట్రోక్ రావడంతో బంధువులు మరియు స్నేహితుల సహకారంతో లక్ష్మక్కపల్లి ఆర్ వి ఎం ఆసుపత్రిలో స్టంట్ వేయించుకోవడం జరిగింది. వైద్యుల సూచనల మేరకు బెడ్ రెస్ట్ తీసుకుంటుండగా ఉన్న రోగం చాలదన్నట్టు ఉన్నపళంగా మరొక రోగం వెన్నుపూస రూపంలో రాగా అదే లక్ష్మక్కపల్లి ఆర్ వి ఎం ఆసుపత్రిలో వెన్నుపూసకు ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది.చికిత్సానంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి తన ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చిన సందర్బంగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించిన అతని ఆప్తులు బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, కొడవటూర్ దేవస్థాన డైరెక్టర్ మొద్దు భాస్కర్,బచ్చన్నపేట మండల యువ నాయకులు కళ్లెం రమేష్, బొట్టు గణేష్.అధైర్య పడొద్దు అండగా ఉంటామని నరేష్ కు మరియు అతని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపడం జరిగింది.