విద్యార్థులకు త్రాగునీటిని అందించిన జంగిటి విద్యనాథ్
మానవత దృక్పథం గల సామాజికవేత్త జంగిటివిద్యనాథ్…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
గత కొన్ని రోజులుగా జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం, పడమటి కేశవపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంచినీరు అందించే ఫిల్టర్ షెడ్ రిపేర్ చేయకపోవడంతో త్రాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారని సామాజికవేత్త, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు జంగిటి విద్యనాధకు పాఠశాల హెచ్ఎం విజయ తెలియజేయడంతో వెంటనే స్పందించి తన సొంత డబ్బులు 14 వేల రూపాయలు ఖర్చుపెట్టి ఫిల్టర్ షెడ్ ను రిపేర్ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు త్రాగునీరు తాగుతూ ఇలాంటి సామాజికవేత్త మండలంలో గ్రామంలో ఉండడం గర్వించదగ్గ విషయమని వారికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. వారు ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేపట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు వారు తెలియజేశారు.