విద్యార్థుల్లో ఉన్న సంపూర్ణ సామర్థ్యాలను వెలికి తీయాలి
— బాలల హక్కులు చట్టాలపై అవగాహన కల్పించాలి
— జాతీయ అడ్వైజరి కౌన్సిల్ సభ్యుడు మాతిన్ అహ్మద్
ప్రజా గొంతుక న్యూస్/జనగామ రూరల్:
విద్యార్థుల్లో ఉన్న సంపూర్ణ సామర్థ్యాలను వెలికి తీయడం ద్వారా వారి భవిష్యత్ కు బాటలు వేసిన వారమవుతామని (ఎస్.సి.ఇఆర్.టి)స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫ్యాకల్టీ ఎస్.డి మాతిన్ అహ్మద్ అన్నారు.విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా,డైరెక్టర్ నరసింహా రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని పెంబర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను వారు సందర్శించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో వారి సంపూర్ణ సామర్థ్యాలను వెలికి తీసి,వారి ఉన్నత భవిష్యత్ కు బీజం వేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.వారికి బట్టి పట్టే విధానానికి స్వస్తి పలులుకుతూ, మ్యాక్ డ్రిల్స్,కల్చరల్ ప్రోగ్రామ్స్,సైన్స్ ఫెయిర్ పార్టిసిపేషన్,ఆటలపై శ్రద్ధ,సెమినార్ లాంటి వాటిపై వారికి అవగాహన తో పాటు ప్రతి విద్యార్థి అందులో పాల్గొనేలా చూడాలని సూచించారు.అలాగే విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ,విద్యా హక్కు చట్టం పై వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.జయశ్రీ,ఉపాద్యాయులు సి హెచ్ జలజ,మమత, మన్విత,రేణుకా,తదితరులు పాల్గొన్నారు.