- టైం పాఠశాలలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలు
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో:: జూన్:21
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం స్థానిక హాలియా మున్సిపాలిటీ టైం పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలను పాఠశాల డైరెక్టర్లు మంద నరేందర్ రెడ్డి , కత్తి కోటిరెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు యోగాసనాల్లో భాగంగా 12 యోగాసనాలు ప్రదర్శించారు సూర్య నమస్కారాల్లో భాగంగా పద్మాసనం, సుఖాసనం ,వజ్రాసనం, వృక్షాసనం, భుజంగాసనం, ధనురాసనం ,చక్రాసనం, హస్తపాదాసనం, సిద్ధాసనం, వలాసనం ,త్రికోణాసనం, పర్వతాసనం ,మొదలైన ఆసనాలు, విద్యార్థులచే చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ వర్ష మాట్లాడుతూ ఈ యోగాసనాల వల్ల విద్యార్థులలో శారీరక మానసిక దృఢత్వాన్ని పెంచుకోవడానికి దోహదపడే ఉపయోగాలు ఉన్నాయని మరియు ప్రతినిత్యం ఇలాంటి యోగాసనాలు చేయటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది, పిల్లలు పరిపూర్ణ ఆరోగ్యం గా తయారవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలు జ్ఞాపకశక్తి మెరుగవుతూ చక్కని విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.