పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు ఎస్ఎఫ్ఐ సమరశీల పోరాటాలు నిర్వహించాలి.
కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కోండేటీ శ్రీను
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )నాగార్జునసాగర్ నియోజకవర్గం: ఫిబ్రవరి: 17
హలియా. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాగార్జునసాగర్ డివిజన్ మహాసభ స్థానిక విశ్రాంత ఉద్యోగుల
భవనంలో నిర్వహించడం.ఈ డివిజన్ మహాసభకు ముఖ్యఅతిథిగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కోండేటీ శ్రీను హాజరై ప్రసంగించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు ఇస్తానన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రాష్ట్రంలో 8,350 కోట్లు పెండింగ్లో ఉంటే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులు ఏ విధంగా ముందుకు పోతాయో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరో విద్యా సంవత్సరం ముగియడానికి వస్తున్న గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో నుండి బకాయిల ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటివరకు విడుదల చేయకుంటే భవిష్యత్తులో పరీక్షలు ముగియడానికి వస్తున్నాయి. పై చదువులకు పోవాలంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వడం కుదరదని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని హెచ్చరించారు.భారత విద్యార్థి పేడరేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహాసభలు ప్రారంభం అయ్యాయి.భవిష్యత్లో. తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఖమ్మం జిల్లాలో జరగబోతున్నాయి.ఈ మహాసభల లో దేశంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావ్యతిరేకవిధానాలపై సమగ్రంగా చర్చించి విద్యార్థుల హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఛాంపియన్ లాగా ఎస్ఎఫ్ఐ పోరాటం నిర్వహిస్తుందని హెచ్చరించారు .దేశంలో బిజెపి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం కంగనగట్టుకుందని దేశ బడ్జెట్లో విద్యారంగానికి 1, 28650 కోట్ల ఏ విధంగా సరిపోతాయో దేశ ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. విద్యారంగంలోకి మతోన్మాద కాషాయకరణ భావజాలను తెప్పించడం కోసం బిజెపి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటాలు నిర్వహించడానికి విద్యార్థులందరిని ఏకం చేసి పోరాటాలను ఉదృతం చేసి విద్యార్థులు ప్రధాన హక్కుల సాధనకై ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేయడం జరిగింది. నల్గొండ జిల్లా మహాసభలు ఫిబ్రవరి 19, 20 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగా సమస్యలను అధ్యయనం చేసి నల్గొండ జిల్లా విద్యారంగ సమగ్ర అభివృద్ధి కోసం భవిష్యత్ కరాచరణ తయారు చేయడం కోసం ఈ మహాసభలు వేదిక కానున్నాయని అన్నారు.భవిష్యత్ లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరి కదిలింది బలమైన పోరాటాలు నిర్వహించాలని పిలుపు నివ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో ,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, రవి నాయక్ ,కోరె రమేష్ నల్లబెల్లి జగదీష్,బుడిగపాక వర్షత్, నవీన్ సాయి కార్తిక్ శివ చరణ్ అంజలి తదితరులు పాల్గొన్నారు.