పల్లా త్వరగా కోలుకోవాలని చెరువుగట్టులో ప్రత్యేక పూజలు
నిర్వహించిన మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత , ఆపద బంధువుడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యం తో కోలుకొని ప్రజల్లోకి రావాలని ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని నల్లగొండ జిల్లా చెరువుగట్టు లో దేవునికి ప్రత్యేక పూజలను బచ్చన్నపేట మండల మాజీ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆ దేవుడి ఆశీస్సులు వారికి ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.