భవన రంగాల కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా మేడే వారోత్సవాలు
ప్రజా గొంతుక/బచ్చన్నపేట
బచ్చన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో 139 వ మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా బచ్చన్నపేట టిబిఎన్ఆర్ కేఎస్ మండల అధ్యక్షుడు జెర్రిపోతుల రాజు జెండా ఆవిష్కరించి మాట్లాడారు 1886లో చికాగో నగరనా వేలాది మంది కార్మికులు 18 గంటల పని దినాని ఎనిమిది గంటలకు కుదించాలని నిరసిస్తూ ఎంతోమంది కార్మికులు తమ రక్తాన్ని ధారబోసి సాధించుకుందే మేడే అని అన్నారు ఈ మేడే సందర్భంగా అమరులను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కర్షకులకు శ్రామికులకు ప్రపంచ కార్మికులకు మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, మరియు బచ్చన్నపేట పట్టణ అధ్యక్షులు గంధమల్ల కిష్టయ్య ఆధ్వర్యంలో బి ఎన్ ఆర్ కె ఎస్ జెండా ఆవిష్కరించి శ్రమను నమ్ముకొని చెమటోడుస్తున్న ప్రతి కార్మికుడికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, టైల్స్ అధ్యక్షుడు గంధ మల్ల కిష్టయ్య కాసర్ల కరుణాకర్, బియ్య ఐలయ్య , పర్వతాలు, పెయింటింగ్ యూనియన్ అధ్యక్షులు జె ర్రిపోతుల అంజయ్య, ఉప్పరి నరసయ్య, రంగారెడ్డి, ఇరుగు మహేందర్, గంధమల్ల నరేష్, గుడ్ల మనోహర్, అబ్బ సాయిలు, పుల్లయ్య, బిక్షపతి, జంపయ్య, కుక్కుడాల పాండు రంగం, శ్రీనివాస్, జయరాజ్, లక్ష్మయ్య, సంపత్, కిషన్, ఉప్పలయ్య, ఉపేందర్,సిద్దులు,మోహన్, అల్వాల రాజు తదితరులు పాల్గొన్నారు.