షాట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైన ఇల్లు
ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న మధారిగూడెం గ్రామస్తులు
ప్రజా గొంతుక న్యూస్ (ప్రతినిధి )షేక్ షాకీర్: (మధారిగూడెం) నాగార్జున సాగర్ నియోజక వర్గం: ఫిబ్రవరి:12
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం మదారిగూడెం గ్రామంలో అచ్చిరెడ్డి కాలనీలో బొడ్డుపల్లి శంకర్ యొక్క ఇల్లు కరెంట్ షాక్ సర్క్యూట్ వల్ల ఇల్లు పూర్తిగా కాలిపోయింది.బొడ్డు పల్లి శంకర్ ది నిరుపేద కుటుంబం నలుగురు ఆడపిల్లలు బొడ్డుపల్లి శంకర్ వృత్తి. గ్రామపంచాయతీలో డాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు.రెక్కాడితే గాని కడుపునిండని కుటుంబం వారిది. ఇట్టి విషయం తెలుసుకున్న.గ్రామ పార్టీ అధ్యక్షుడు.మరియుగ్రామ పార్టీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వారి వంతుగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది.మరియు ప్రభుత్వం నుండి కూడా సహాయ అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. సర్వర్ మాజీ సర్పంచ్ పోశం శ్రీనివాస్ గౌడ్ రిక్కల సుధాకర్ రెడ్డి షర్పద్దిన్ ఇబ్రహీం జలీల్ సలీమ్. రావుల శంకరయ్య రావుల సీతారాములు గడ్డం శీను.సీత ముత్తయ్య. రావులా పాటి వెంకయ్య.తరి సైదులు.ఎడవల్లి ఏసోబు.బొడ్డుపల్లి శంకర్ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది