ఉద్యమకారులు పోస్ట్ కార్డు ఉద్యమం లో భాగంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పోస్ట్ కార్డులు రాసిపంపిన
రాష్ట్ర మహిళా నాయకురాలు—– జానకి రెడ్డి
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: నాగార్జున సాగర్ నియోజక వర్గం: మార్చి:05
తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం పిలుపుమేరకు నాగార్జునసాగర్ లోని ఉద్యమకారులు పోస్ట్ కార్డు ఉద్యమం లో భాగంగా రాష్ట్ర మహిళా నాయకురాలు జానకి రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పోస్ట్ కార్డులు రాసి పంపడం జరిగింది. ఈ సందర్భంగా జానకి రెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని 25 వేల రూపాయలు పెన్షన్ హెల్త్ కార్డును ఉద్యమకారుల గుర్తింపు కార్డును ఉచిత బస్పాస్ ను వెంటనే అమలు చేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ హీరే కార్ రమేష్ జి సభావత్ చంద్రమౌళి నాయక్ సల్లోజు షేకరాచారి పందిర్ల సత్యనారాయణ స్వామి లక్ష్మణ్ నాయక్ గుజ్జుల కొండలు తదితరులు పాల్గొన్నారు