బీరప్ప కామరతి పండుగ కు భారీ విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్ దంపతులు.….
దైవభక్తిలో మాజీ సర్పంచ్ దంపతులు…..
ప్రజా గొంతుక / బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం, తమ్మడపల్లి గ్రామంలో శ్రీ బీరప్ప కామరతి పండుగ సందర్భంగా దైవభక్తి తో తాజా మాజీ సర్పంచ్ శ్రీ మేకల కవితా రాజు ఒక లక్ష 16 వేల116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా బీరప్ప కామరతి దేవుళ్లను దర్శించుకుని ప్రత్యేక మొక్కలను చెల్లించారు. గ్రామ ప్రజలు మరియు గొల్ల కురుమ కుల బంధువులు అందర్నీ చల్లగా చూడాలని ఆ దేవుని కోరారు.ఈ సందర్భంగాపెద్ద కురుమమేకలమల్లేశం,పెద్దగొల్లఅబ్బసానికుమారస్వామి ,షారి కురుమ బెజాడి రామచంద్రం,షారి గొల్ల బాదం రాములు,బెజాడి నాగరాజు , సనికరాజు,బాదం శ్రీనివాస్,అబ్బసాని వేణు,బాదం మల్లయ్య,జన్నె సిద్ధులు, అబ్బసాని లక్ష్మణ్,మేకల బాబు, మేకల వీరస్వామి,స్థానిక కనకరాజు, మేకల బీరయ్య,అబ్బసాని అంజి, పయ్యావుల శ్రీను,బెజాడి మల్లేశం, మేకల మహేష్ తదితరులు పాల్గొన్నారు.