రామకృష్ణాపూర్ పట్టణంలో ఆర్.ఎం.పి వైద్యం వికటించి 25 సంవత్సరాల యువకుడు మృతి
ప్రజా గొంతుక న్యూస్ ఉమ్మడి జిల్లా బ్యూరో మామిడాల రవీందర్
రామకృష్ణాపూర్ పట్టణంలో శుక్రవారం భగత్ సింగ్ నగర్ కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి గొల్లపల్లి శ్రీనాథ్(25) సంవత్సరాల యువకుడు సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు కార్పెంటర్గా పనిచేస్తాడు కడుపు నొప్పికి ట్రీట్మెంట్ గురించి సదరు డాక్టర్ను సంప్రదించగా ఇంజక్షన్ టాబ్లెట్స్ ఇచ్చి పంపినాడు ఇంటికి వెళ్లిన శ్రీనాథ్ కాసేపటికే నోటి నుండి నురగలు రావడంతో పరిస్థితి విషమంగా మారిందని కుటుంబ సభ్యులు గమనించి మంచిర్యాల పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించినారు అప్పటికే మృతి చెందినడని వైద్యులు నిర్ధారించారు ఆర్.ఎం.పి నిర్లక్ష్మీ తోనే మృతి చెందాడని మృతుని తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా సీఐ శశిధర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించినారు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి కి మృతదేహాన్ని తరలించినారు