ఓ.యూ,లో కుందూరు జానారెడ్డి జన్మదిన వేడుకలు
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో: జూన్:20
ఓ.యూ,లో కుందూరు జానారెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి మరియు మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ పేర్ల బాలు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దలు జానా రెడ్డి, నేటి యువతకు,రాజకీయ నాయకత్వానికి ఆదర్శవంతమైన రాజకీయ చాణక్యునిగా వ్యవహరిస్తూ ఎంతోమందిని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వలిగొండ నరసింహ, కొమ్మనబోయిన సైదులు యాదవ్,వంగూరి శివ,సాయి కుమార్, మనోజ్, శేఖర్, శివశంకర్ మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.