యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దొంతి దంపతులు
ప్రజా గొంతుక న్యూస్ నర్సంపేట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగినది ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిని ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికి అనంతరం పూజా కార్యక్రమం నిర్వహించారు.స్వామివారి దర్శనానంతరం నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ టీటీడీ తరహాలో వైటిడి ఏర్పాటు చేయడం ప్రత్యేక నిధులు ప్రత్యేక పాలక మండలి ద్వారా దేవాలయ అభివృద్ధితోపాటు తెలంగాణ రాష్ట్రం తో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల లోని భక్తులు ప్రజలందరూ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని రాబోయే రోజుల్లో దేశ ప్రజలను ఆకర్షించే స్థాయిలో యాదాద్రి ఉంటుందని ఆ దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు అడుగులు వేస్తుందని అన్నారు.నర్సంపేట నియోజకవర్గ తో పాటు తెలంగాణ రాష్ట్రం ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని,ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.