మహిళలపై జరుగుతున్న హత్యలకు,అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం
పి ఓ డబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు తొడం దుర్గమ్మ,నూపా సరోజిని లు పిలుపు
ప్రజా గొంతుక మార్చి 6 అశ్వరావుపేట నియోజకవర్గ ప్రదినిధి
దమ్మపేట మండలం లో అంతర్జాతీయ మహిళా పోరాట దినం ఆవిర్భవించి,నేటికీ 114 సంవత్సరాల అయిందని,నాటి నుండి నేటి వరకు మహిళలపై జరుగుతున్న అణచివేత,వివక్షకు, అసమానత్వానికి వ్యతిరేకంగా తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారని,అయినప్పటికీ నేటి సమాజంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయనీ,కానీ,తగ్గలేదని,హత్యలు,అత్యాచారాలు నిత్య కృత్యమయ్యాయని,కనుక మహిళపై జరుగుతున్న దాడులకు,పరువు హత్యలకు అత్యాచార్లకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు తోడం దుర్గమ్మ పిలుపునిచ్చారు.దమ్మపేట సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆఫిస్ లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ శ్రమిక మహిళా పోరాట దినం మార్చి 8 కార్యక్రమం సందర్భంగా సభను నిర్వహించారు.ఈ సభకు గంగాధర నాగమణి అధ్యక్షత వహించారు.అనంతరం తొడం దుర్గమ్మ,నూపా సరోజిని లు హాజరై మాట్లాడుతూ,ఐదు సంవత్సరాల పసిపాపల నుండి పండు ముసలి వరకు ఎవరికీ రక్షణ లేదని మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,చట్టాలు నామమాత్రంగా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.పశ్చిమ బెంగాల్ ఆర్జి కార్ హాస్పిటల్ లో జూనియర్ డాక్టర్ అభయ హత్య,అత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన నిరసన జ్వాలలు పెల్లుబికాయని,దోషులను శిక్షించాలని నిరవధికంగా ఆందోళన చేశారని,ఫలితంగా,దోషుల్లో ఒక్కరిని మాత్రమే బాధ్యులు చేసి,పోలీసులు ప్రభుత్వం చేతులు దులుపుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.బిల్ కిస్ భాను ఘటనకు బాధ్యులైన దోషాలను బిజెపి ప్రభుత్వం సత్కరించి న వీరి నైజం మతతత్వ భావజాలానికి నిదర్శనమని ఆమె విమర్శించారు.దేశంలో రాష్ట్రంలో పరువు హత్యలు జరుగుతున్నాయని,ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న మహిళా కానిస్టేబుల్ను తమ్ముడే హత్య చేయటం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నావ్,ఖతార్,బిల్ కిస్ బానో, ల్మణిపూర్ నిందితులను మతమ రంగు పులిమి మద్దతు ఇవ్వటమే నిలువెత్తు నిదర్శనం అని,దేశాన్ని రాష్ట్రాన్ని పాలించే 151 మంది ఎమ్మెల్యేలు ఎంపీలపై మహిళలను వేధింపులకు గురి చేసిన స్వతంత్ర భారతం మనదని ఆమె ఏద్దేవా చేశారు.నేరగాళ్లకు కఠిన శిక్షలు తప్పవని ప్రధాని మోడీ హెచ్చరించారని,కానీ సమాజంలో కుల రక్తసిని మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న ప్రజల్లో అసమాన తలను అనైక్యతను సృష్టించడమే గాక మహిళలపై మరింత అణిచివేతకు హింసలకు పోరుగలిపే మనువాద భావజాలాన్ని మహిళపై జరుగుతున్న దాడులకు ఈ పరువాతేలకు వ్యతిరేకంగా మహిళా లోకం నడుంబించాలని ఆమె పిలుపునిచ్చారు.మహిళలపై నేరం పాపమని,కఠిన శిక్షలు తప్పవన్న మాటలను చిత్తశుద్ధితో నిలబెట్టుకోవాలని డిమాండ్ చేద్దాం.ఆడదంటే అబలకాదు సభలని సవాలు చేస్తూ మార్చి 8 స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జుంజునూరి ముక్తేశ్వరి,పెళ్లూరి మంగ,పర్వతం జ్యోతి,పవిత్ర,సోడం కుమారి,దారబోయిన లక్ష్మి, ధారబోయిన మంగ,తాటి రాఘవమ్మ,తంగేళ్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.