ప్రమాణ స్వీకారానికి…. పెద్దఎత్తున బయలుదేరిన మహేశ్వరం యువనాయకులు
— *తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ప్రమాణస్వీకారానికి…. భారీగా తరలిన వచ్చిన మహేశ్వరం నాయకులు*
*ప్రజా గొంతుక ప్రతినిధి,మహేశ్వరం (చిక్కిరి.శ్రీకాంత్*):
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రం నుండిఈరోజు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మహేశ్వరం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు గొల్లూరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులుగా జక్కిడి శివ చరణ్ రెడ్డి మరియు బృందం ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వరం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇమ్మడి ప్రవీణ్ పటేల్, యూత్ కాంగ్రెస్ నాయకులు గణేష్, రాఘవేందర్, సుధాకర్,నాగేందర్ నాయక్, రవీందర్ నాయక్,వెంకటేష్ , శ్రీశైలం శ్రీను, షరీఫ్ మరియు ఎన్ఎస్ యు ఐ నాయకులు పాల్గొన్నారు