తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటాలకు
కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం
**బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో*-
*బిల్లులకు ఆమోదం తెలపడం హర్షించదగిన, చారిత్రాత్మకం”
– కేశంపేట్ మండల మాజీ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి
మన సాక్షి గొంతుక/ తెలంగాణ బ్యూరో
కేశంపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడ వీరేష్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవలకు నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ, “బీసీలకు 42% రిజర్వేషన్ మరియు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో బిల్లులకు ఆమోదం తెలపడం హర్షించదగిన, చారిత్రాత్మక సంఘటన” అని ప్రశంసించారు. ఈ నిర్ణయాలు సామాజిక న్యాయం సమానత్వాన్ని సాధించడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడ వీరేష్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించారు.