మున్సిపల్ కమిషనర్ టి.రమేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ.
ప్రజా గొంతుక న్యూస్ సుల్తానాబాద్/రిపోర్టర్ నూక రాందాసు
వినాయక చవితి సందర్భంగా
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో
మట్టి వినాయక విగ్రాహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ టి.రమేష్ మాట్లాడుతూ, మట్టి గణపతిని పూజించడం వలన పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా, పంచభూతాల ఆరాధన, ప్రకృతితో అనుబంధం, మానసిక ప్రశాంతత వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మట్టి విగ్రహం పర్యావరణహితమైనది, రంగులు, రసాయనాలు లేనిది, నీటిలో సహజంగా కరిగిపోతుంది, కావున నీటి వనరులకు హాని కలిగించదు. ఇది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే కాలుష్యాన్ని నివారిస్తుంది. కావున పట్టణ ప్రజలు మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.రమేష్, మునిసిపల్ మేనేజర్ అలీమొద్దీన్ , ఏ ఈ రాజ్ కుమార్ ,మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.