ఘనంగా యూత్ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు……
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి పాల్గొని శాలువలతో సన్మానించి సత్కరించారు. అనంతరం కేక్ లు కట్ చేపించారు. ఈ సందర్భంగా పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఉంటుందని,యువత రాజకీయాలలో రాణించి, సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా సందీప్, ఆముదాల మల్లారెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, నిమ్మ కరుణాకర్ రెడ్డి, చింతకింది మురారి, నీల రమేష్, ఉపేందర్ రెడ్డి, హరికృష్ణ, జంగిటి సిద్ధులు, జంగిటి నరేష్, నల్ల మహేందర్, దేవరకొండ రమేష్, అఖిల్ మాల ,అభి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.