బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం … జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
*జూన్ -17 సాయంత్రం 5 గంటల లోపు కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి*
**జూన్ -20న లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక చేయబడును*
**3వ, 5వ, 8వ తరగతుల్లో ప్రవేశం కొరకు గిరిజన విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి*
ప్రజా గొంతుక పెద్దపల్లి ప్రతినిధి: ఇరుకుల్ల వీరేశం
2025-26 సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో 3వ, 5వ, 8వ తరగతుల్లో ప్రవేశం కొరకు పెద్దపల్లి జిల్లాలోని గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు జూన్ 6 లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు మొత్తము (5) సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.
*మూడవ తరగతిలో* లంబాడ బాలికలకు ఒకటి, బాలురకు ఒకటి, ఎరుకుల బాలురకు ఒకటి చొప్పున కేటాయించడం జరిగిందని తెలిపారు.
*ఐదవ తరగతిలో* గోండు బాలురకు ఒకటి, 8వ తరగతి లో లంబాడ బాలికలకు ఒకటి చొప్పున కేటాయించడం జరిగిందన్నారు.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ ప్రాంతంలో రెండు లక్షలు, రూరల్ ప్రాంతంలో ఒక లక్షా 50 వేలు ఉండాలని, ధ్రువీకరణ పత్రాలు ఆదాయం, కులం, బర్త్, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ 2 సైజ్ ఫోటోలను జత చేసి పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 17లోగా కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని, వచ్చిన దరఖాస్తుల నుండి జూన్ 20న లాటరీ పద్ధతిలో ద్వారా ఎంపిక చేయనున్నట్లు, ఇతర వివరాలకు ఫోన్ నెంబరు 9652118867 నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.