విద్యా రంగ సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతాం
ఎస్ఎఫ్ఐ నాగార్జున సాగర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శి లు నల్లబెల్లి జగదీష్- కోరే రమేష్
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: నాగార్జున సాగర్ నియోజక వర్గం: ఫిబ్రవరి:12
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు భారత విద్యార్థి ఫెడరేషన్ కే వి పి ఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, మరియు వ్యవసాయ కార్మిక సంగం జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరు కోటేష్ మహాసభకు ముఖ్యఅతిథిలు గా హాజరై వారు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నాయని విద్యార్థులకు అందవలసిన స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్ మెంట్ బకాయిల విడుదల చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ విద్యార్థుల పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలకి సొంత భవనం లేక విద్యార్థులు అద్దె భవనంలో ఇబ్బందులు పడుతున్నారు అయినా కానీ కడుతున్నామని కాలయాపన చేస్తున్నారు కానీ విద్యార్థులకు సొంత భవనం అందించలేదు బీసీ బాయ్స్ హాస్టల్ కి కూడా సొంత భవనం లేక అద్దె భవనంలో ఉంటున్న పరిస్థితి నెలకొంది వీరికి వెంటనే సొంత భవనాలు నిర్మించి విద్యార్థులకు న్యాయం చేయాలి అధికారంలోకి రాకముందుకు రేవంత్ సర్కార్ విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోమద్యం శాఖ మంత్రి వున్నాడు కాని విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదర్శ పాఠశాలలో జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని గత ప్రభుత్వం గొప్పలు చెప్పి పేద మధ్యతరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన అందిస్తామని చెప్పి మర్చిపోయిందని అందుకనే గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపారని అన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈనెల 19 ,20 తేదీలలో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లా మహాసభలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం నల్గొండ పట్టణ కేంద్రంలో జరిగే 45వ మహాసభలను జయప్రదం చేయాలని అన్నారు అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శి లను ఎన్నుకున్నారు మండల అధ్యక్షులు గా రాకేష్ కార్యదర్శి గా పవన్ ఎన్నుకోవడం జరిగింది కమిటీ సభ్యులుగా దత్తు,తేజ,దివ్య,కీర్తన కార్యదర్శులు గా నవీన్, అధ్యక్షులు గా సై ఎన్నుకోవడం జరిగింది , వర్షిత్,అంజి,శివ తదితరులు పాల్గొన్నారు.