కరెంటు షాక్ తో కాంగ్రెస్ నాయకుడి మాతృమూర్తి మృతి…
పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి
ప్రజా గొంతుక / బచ్చన్నపేట మండలం:
బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జ్యోతి భాస్కర్ తల్లి జ్యోతి అంజమ్మ కరంట్ షాక్ తో మరణించగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించి జ్యోతి భాస్కర్ ను పరామర్శించారు. భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అధైర్యపదొడ్డని ధైర్యాన్ని నింపారు.పరామర్శించిన వారిలో బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అరవింద్ రెడ్డి,జిల్లా సందీప్,క్రాంతి, జంగిడి సిద్దులు,హరికృష్ణ, కర్రే, నరేష్,అఖిల్ మాల, తదితరరులు పాల్గొన్నారు.