ప్రజాసేవకుడు పోతుల రాములు అన్న….
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామంలో మరో కుటుంబానికి సామాజికవేత్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతుల రాములు యాదవ్ అండగా నిలిచారు.పోచన్నపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన బోడ మల్లయ్య కుటుంబాని పరామర్శించి, నేనున్నానని మనోధైర్యాన్ని నింపి, వారికి సహాయంగా 5000 రూపాయలను పోతుల రాములు యాదవ్ అందించారు. అడగకుండానే ఇంటికి వచ్చి ఆర్థిక సహాయం అందించిన వారికి రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా కోక్కలకొండ బాబు, బుడిగ రామచంద్రం, వస్పరి నరసింహులు, తుప్పతి నరసింహులు, తుప్పతి బాలయ్య ,బండ సంపత్, బోడ సిద్ధులు, పరిధ రమేష్, తదితరులు పాల్గొన్నారు.