శివయ్యా నువ్వే మాకు దిక్కు అనుకుంటే తప్పేంటి?
*జాతరలు(హిందూవుల)ఉత్సవాల పేరిట అదనపు ఛార్జిలేలా?*
*ప్రయాణికులారా జాగ్రత్త..?*
*అదనపు చార్జీలు ఖర్చు చేస్తున్నారంటా?*
*అదనపు చార్జీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు,సామాన్య ప్రజలు.*
ప్రజా గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో
ఏ సేవలలో చూసినా,ఎందులో చూసినా, ఎక్కడికెళ్లినా ఇక్కడ బలయ్యేది ముఖ్యంగా హిందూవులలో ఉన్న సామాన్య పేద ప్రజలు,భక్తులు మాత్రమే…ఎందుకంటే మనకు ఏవైనా పండుగలు వస్తే ప్రయాణం చేయాలంటే బస్సులను ఆశ్రయించాల్సిందే…మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం,,మరి పిల్లలు,పురుషులు వెళ్లాలంటే కచ్చితంగా టికెట్ తీసుకోవాలి ఇంతవరకు బాగానే ఉంది,కానీ,హిందూవుల పండుగలకు(సంక్రాతి,దసరా,ఉగాది,దీపావళి)లకు హైదరాబాద్ నుండి గానీ నగరాల నుండి గ్రామాలకు వెళ్లాలంటే జేబులు ఇక తడిసి మోపడు కావడం ప్రతిసారి చూస్తున్నాం…ప్రస్తుతం హిందూవులకు పెద్ద స్పెషల్ ఉత్సవాలు(జాతర)అంటే గుర్తుకు వచ్చేది వెళ్ళేది మహా శివరాత్రి…సుమారు వారం రోజులు శైవ క్షేత్రాలకు భక్తులు,ఉపవాసం ఉన్నవాళ్లు,మొక్కులు తీర్చుకోవడానికి లక్షల్లో పోతుంటారు,వెళ్తారు.ఇదే సాకుగా అటు ఆర్టీసీ అదనపు చార్జీల పేరుతో వసూలు చేయడానికి పెద్ద ప్రకటనే చేసింది.ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం ఎక్సట్రా అదనంగా చార్జీలు వసూలు చేయడానికి ఏకంగా ప్రకటన చేసేసింది.ఈనెల 24 నుంచి 28 వరకు స్పెషల్ బస్సులను నడుపుతూన్నట్లు తెలిపింది.ముఖ్యంగా శైవ క్షేత్రాలైన శ్రీశైలం,వేములవాడ,ఏడుపాయల, కీసరగుట్ట,వేలాల,కాళేశ్వరం,కొమరవెల్లి,అలంపూర్,రామప్ప దేవాలయాలకు సుమారు 3వేల బస్సులను నడుపుతామని టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది.ఇందులో ఇంకో ఫెసిలిటి కూడా ఇచ్చారాండోయ్ రెగ్యులర్ బస్సుల్లో మాత్రం సాధారణ చార్జీలే ఉంటాయని..మరి అదనపు చార్జీలు పెట్టుకుని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి పోతే అక్కడ సిబ్బంది,ప్రయివేట్ వ్యక్తులు దేవుడిని కాసేపు చూడటానికి రెండు నిముషాలు కూడా సమయం ఇవ్వరూ పైగా తోసేస్తారు,మరి వందల కిలోమీటర్ల నుండి ఇష్టమైన పండుగ రోజు,హిందూవులకు ఇష్టమైన,ఆరాధ్య దైవం మహా శివుడు దర్శనం లేనప్పుడు ఇక 50 శాతం ఎక్కువ టికెట్ తీసుకుని,సంతృప్తి పడకుండా ఎక్కడో బయట నిలబడి మొక్కి రావడం అవసరమా అంటూ చాలామంది భక్తులు,పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదైతే ఒకరకంగా ఆలోచిస్తే వాస్తవమే అనిపించకమానదు.ఉపవాసం ఉండేవారు చక్కగా ఇంటివద్దే ఉండి,సాయంత్రం మరుసటి రోజు శివయ్యా నువ్వే మాకు దిక్కు అనుకుని మొక్కులు తీర్చుకుంటే తప్పేంటని కొంతమంది భక్తుల,సామాన్య ప్రజల అభిప్రాయాలు… *SB*✍️