Tuesday, July 8, 2025

ప్రజా గొంతుక న్యూస్ కథనానికి స్పందించిన హాలియా

మున్సిపాలిటీ కమిషనర్ …..యం. రామదుర్గా రెడ్డి

మున్సిపాలిటీ సిబ్బందితో మంటలు ఆర్పించిన హాలియా మున్సిపాలిటీ కమిషనర్

(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో:జూన్:13

నల్గొండ జిల్లా :

నాగార్జునసాగర్ నియోజకవర్గం

హాలియా మున్సిపాలిటీ

హాలియా మిర్యాలగూడ హైవే బ్రిడ్జి కింద.. ప్రతిరోజు భారి స్థాయిలో ఎగిసి పడుతున్న మంటలు… దట్టమైన పొగతో వస్తూపోయే వాహనదారులకు తీవ్ర ఆటంకం కలగడం జరుగుతున్నది.. దట్టమైన పొగ రోడ్డుపై రాకతో ఆ ప్రదేశంలోనే కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి…

కొంతమంది ప్లాస్టిక్ సామాను అమ్ముకునే వారే మంటలు అంటిస్తున్నట్లు ఆ ప్రదేశంలో ఉండే రైతులు తెలియపరిచారు… ఆ చోట టైర్లు, రబ్బరు, తీగలు, ఫీజులు కాల్చి అందులో వచ్చే సామాగ్రిని సమీప పాత ఇనుప కొట్టు షాపులలో అమ్ముకుంటున్నట్లు తెలియపరిచారు…

వారి అవసరాలకు ఆ ప్రదేశంలో మంట పెట్టుట వలన… బ్రిడ్జి నాణ్యత లోపించే అవకాశాలు మరి ఎక్కువే ఎందుకంటే ప్రతిరోజు క్రింద మంట పెడుతున్నారు కాబట్టి…

వాహనదారులకు తీవ్ర అంతరాయం…

కావున దయచేసి మున్సిపాలిటీ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు మరియు పోలీస్ అధికారులు తక్షణమే దృష్టి సారించి ఆ ప్రదేశములో మంట పెట్టకుండా బ్రిడ్జిని పరిరక్షించి వాహనదారులకు సుఖమైన ప్రయాణాన్ని అందించగలరని వాహనదారులు విన్నవించుకుంటున్నారు. మున్సిపాలిటీ కమిషనర్ దృష్టికి వెళ్లగానే కొద్ది నిమిషాల్లోనే స్పందించి మున్సిపాలిటీ సిబ్బందితో మంటలు ఆర్పించిన మున్సిపాలిటీ కమిషనర్ ఎం రామదుర్గారెడ్డి వార్త వచ్చిన కొద్ది నిమిషాల్లోనే స్పందించి మున్సిపాలిటీ సిబ్బందితో ఆర్పించినందుకు ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇకనుండి ఎవరైనా బ్రిడ్జివద్ద రబ్బరు టైర్లు,వ్యర్ధాలు,ఏవైనా వేసిన మంటలు పెట్టిన చట్టరీత్యా చర్యలు తీసుకొనబడును మరియు జరిమానా విధించబడును అని మున్సిపాలిటీ కమిషనర్ ఎం.రామ దుర్గారెడ్డి తెలియజేశారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp