లింగం ధన గ్రామంలో మాజీ వార్డ్ మెంబర్ వడ్డే లక్ష్మమ్మ మృతి
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన బిఆర్ఎస్ నాయకులు
*ప్రజా గొంతుక /కేశంపేట ప్రతినిధి ( రాజమోని రవీందర్ గౌడ్)
కేశంపేట మండలం, ఫిబ్రవరి 12:
లింగం ధన గ్రామపంచాయతీ మాజీ వార్డ్ మెంబర్ వడ్డే లక్ష్మమ్మ, అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర దురదృష్టకరం.ఆమె మృతిపట్ల మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వర్కాల లక్ష్మీనారాయణ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి 5000రూపాయలు,ఆర్థిక సహాయం అందించారు.అలాగే, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుబ్బ సుదర్శన్ గుప్తా 2000, రూపాయలు,గ్రామ శాఖ అధ్యక్షులు బండెల తిరుపతి రెడ్డి,2000, రూపాయలు అందజేశారు.ఈ విషాద సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఆమె కుటుంబానికి పరామర్శిస్తూ అండగా నిలిచారు.వడ్డే లక్ష్మమ్మ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం.